శర్వానంద్ ఇటీవలే నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం ఇవ్వలేదు

వరుస ప్లాప్స్ తర్వాత శర్వానంద్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ ఒకే ఒక జీవితం.

ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైది

అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఒకే ఒక జీవితం.

వరుస ప్లాప్స్ తర్వాత శర్వానంద్ ఒకే ఒక జీవితం తో ఒక మంచి హిట్ ను అందుకున్నాడు.

ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్‌లో కూడా కణం పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఇక అది అలా ఉంటే ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ రానుంది.

ఈ సినిమా అక్టోబర్ 20న సోనిలివ్‌లో స్ట్రీమింగ్ వస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.