హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చాయి.
ప్రస్తుతం ఎల్బీ నగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో సర్వీసులు అందిస్తు్న్నాయి.
కరోనా కారణంగా కొన్ని రోజులు నిలిచిపోయిన మెట్రో.. తిరిగి పునర్ వైభవాన్ని సంతరించుకుంటోంది.
అయితే మెట్రో సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మెట్రో రైలు ఛార్జీలను సవరించలేదు. ఈ మేరకు ఛార్జీలు సవరించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే మెట్రో సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మెట్రో రైలు ఛార్జీలను సవరించలేదు. ఈ మేరకు ఛార్జీలు సవరించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేసేందుకు ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు రేపు (మంగళవారం)తో ముగియనుంది.
ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి పోస్టల్, మెయిల్ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవనున్నారు.
హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తున్నాయి. దీంతో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.