కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’
ఎన్టీఆర్‌కు సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రమిది
అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది
కాగా ఇప్పుడు ప్రారంభానికి ఈ సినిమాకి ముహూర్తం ఖరారైంది.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈనెల 23న లాంఛనంగా మొదలు కానుంది
ఈ మేరకు శనివారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం
పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విప్రేక్షకుల ముందుకు రానుంది