ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది.

ఇక ఆయన లేటెస్ట్ సినిమా ఎన్టీఆర్ 30 ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అది అలా ఉంటే ఎన్టీఆర్ ఓ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట.

విషయంలోకి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2లో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

హృతిక్ రోషన్-ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.

వార్, పఠాన్ విజయాలతో జోరుమీదున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉంటుందట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..