రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే

ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకోవడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు

ఈ నేపథ్యంలో భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ విధంగా మాట్లాడారు

'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న  వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్‌లో మీరు చూసింది అదే

ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి

చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్‌తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి

ఇప్పుడు ఇండియన్స్‌కు పూర్తి నమ్మకం కలిగింది.' అని తెలిపారు తారక్