NTR30తో బిజీగా ఉన్న తారక్, బాలీవుడ్ లోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడంతో అందరూ ఫిక్స్ అయిపోతున్నారు.

తారక్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ‘వార్’, ‘పఠాన్’ మూవీస్ తో స్పై యూనివర్స్ క్రియేట్ చేశారు.

ఇందులో నెక్స్ట్ వస్తున్న మూవీ ‘వార్ 2’. తాజాగా ఈ విషయమై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ప్రకటన చేసింది.

ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. వార్ 2, టైగర్ 3, టైగర్ vs పఠాన్ రాబోతున్నాయి.

ఇప్పుడు ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. ట్విట్టర్ మొత్తం ఈ న్యూస్ తో మార్మోగిపోతుంది.

వార్ తొలి పార్ట్ లో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ ఉన్నాడు.

ఇప్పుడు తారక్ కూడా యాక్ట్ చేస్తాడని అంటున్నారు కాబట్టి ఎలాంటి పాత్ర ఇస్తారు? అది ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.