‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు
ఇప్పుడాయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం కోసం రంగంలోకి దిగారు
‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది
అయితే ఎన్టీఆర్-జాన్వీలపై షూట్ చేసిన ముహూర్తపు షాట్ కు దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టారు
కొరటాల శివ కెమెరా ఆన్ చేయగా ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. కాగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ అందించడం జరిగింది
కల్యాణ్ రామ్, దిల్‌రాజు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్, రత్నవేలు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు
ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే