ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏది చేసిన సంచలనమే.
తన మొండి వైఖరి కారణంగా.. ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ఉత్తరకొరియాకు మిత్ర దేశాలకంటే, శత్రువులే ఎక్కువ.
ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన కిమ్.. తాజాగా తొలిసారి తన కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు.
నవంబరు 18న ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు.
నవంబరు 18 గురువారం ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది.