వేటకి సిద్దమైన ‘స్పై’..
నిఖిల్ హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పై’.
ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిఖిల్‌కి జోడిగా ఐశ్వర్య మేనన్ ఈ చిత్రంలో నటిస్తుంది.
ఈ చిత్రానికి కథ అందించడమే కాగా నిర్మాతగా కూడా ఉన్నారు కె.రాజశేఖర్ రెడ్డి.
1945లో చంద్రబోస్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ కథ కొనసాగనుంది.
కాగా ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శనివారం దీన్ని మరోసారి ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా స్వరాలందిస్తున్నారు.