‘కార్తికేయ2’తో  హీరో నిఖిల్‌ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

ఇటీవలే ‘18పేజెస్‌’తో మరోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు

ఇప్పుడు ‘స్పై’గా ప్రేక్షకులను అలరించేందుకు  సిద్ధమవుతున్నారు నిఖిల్‌

ఫోటోగ్రాఫర్ బీహెచ్‌.గ్యారీ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రమిది

కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నా ఈ చిత్రం వేసవి కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది

సోషల్ మీడియా ద్వారా ఈ మూవీలో కొత్త ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు హీరో నిఖిల్‌

అందులో నిఖిల్ స్పైగా గన్‌ పట్టుకొని స్టైలిష్‌ లుక్‌తో ఉన్నారు

స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది

ఈ చిత్రంలో  నిఖిల్‌ సరసన ఐశ్వర్య మేనన్‌ నటిస్తోంది