2019లో వచ్చిన ‘అర్జున్‌ సురవరం’ సినిమా తర్వాత నిఖిల్‌ నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందకు రాలేదు.

అయితే నిఖిల్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

కార్తికేయ 2, 18 పేజీస్‌ సినిమాలు ఎప్పుడో మొదలైనా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.

దిలా ఉంటే నిఖిల్‌ నటిస్తోన్న మరో చిత్రం ‘స్పై’. గ్యారీ హీహెచ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు.

నిఖిల్‌ నుంచి వస్తోన్న తొలి పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది.