నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది.
ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్న చిత్రమిది.
తాజాగా గురువారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు మూవీ మేకర్స్.
ఈ చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.
దీని సంబంధించి ఓ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఆ ఫస్ట్‌లుక్‌లో యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతున్న యోధుడిలా కనిపించారు ఆకట్టుకున్నారు నిఖిల్.
దీనిబట్టి ఇది సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
‘‘ఇది నిఖిల్‌కు 20వ సినిమా. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రమిది.
అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.
ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అంటూ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.