మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది.
భర్తతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం వర్క్‌పైనే ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన నిహారిక ఈమధ్యే నటిగానూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2లో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందట.
ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవిని సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట.
ఇప్పుడు ఆ రోల్‌లో నిహారిక కనిపించనున్నట్లు సమాచారం.
గిరిజన యువతిగా పుష్ప-2లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్ మెస్మరైజ్ చేయనుందన్నమాట.