ఈ సంవత్సరం ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా మూవీతో బిజీగా ఉన్నాడు
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఊర మాస్ లుక్ లో నాని కనిపించనున్నాడు
ఇందులో హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటిస్తోందన్న విషయం తెలిసిందే
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు
మరోవైపు నిర్మాతగానూ నాని హిట్ 2 మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు
తరువాత రాబోతున్న హిట్ 3లో నాని స్వయంగా నటించబోతున్నాడు
తాజాగా నాని తన 30వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ కానుకగా సర్‌ప్రైజ్ అందించాడు
నాని కుర్చీలో కూర్చుని మొబైల్ బ్రౌజ్ చేస్తూ పోస్టర్‌లో కనిపించాడు
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోయే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనున్నారు