శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీతో  ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో నాని

నాని తొలి పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న దీన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు

కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది

ఈ నేపథ్యంలోనే ప్రమేషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం

ఇందులో భాగంగా ఈనెల 8న ‘‘చమ్కీల అంగీలేసి’’ అనే సాంగ్ రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్

ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలిపింది మూవీ యూనిట్

ఈ మేరకు  నాని, కీర్తి జంటగా స్కూటర్‌పై వస్తూ కనిపించే ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు