ప్రభాస్ రాముడిగా ఓంరౌత్ తెరకెక్కించిన రామాయణ ఆధారిత చిత్రం ఆదిపురుష్

ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనాన్ నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటె ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రొమోషన్స్ పర్వం వేగవంతం చేసింది చిత్రబృందం.

ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రయిలర్ ఐఫీస్ట్ అనిపించింది.

ఇటీవలే విడుదలైన జై శ్రీరామ్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా తాజాగా సోమవారం ఈ చిత్రం నుంచి రెండో పాటను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఆదియు అంతము రామునిలోనే అంటూ సాగె ఈ పాట యూట్యూబ్ లో వ్యూస్ తో దూసుకుపోతుంది.

రామజోగయ్యే శాస్త్రి లిరిక్స్, సచిత్, పరంపర సంగీతం అందించిన ఈ సాంగ్ విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.