మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న మాస్ మసాలా మూవీ 'వాల్తేరు వీరయ్య'
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నా సంగతి తెలిసిందే
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్నాయి
‘డొంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అంటూ సాగే మరో సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం
ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా రామ్ మిర్యాల, రోల్‌రైడాలు ఆలపించారు
మధ్య మధ్యలో ఈ గీతానికి చిరు, రవితేజలు కూడా తమ గొంతు కలపడమే కాకుండా కలిసి స్టెప్పులు కూడా వేశారు
చిరు, రవితేజను ఒకే ఫ్రేంలో చూస్తుంటే నిజంగానే అభినులకు పూనకాలు తెప్పించేలా ఉంది