‘గాండీవధారి అర్జున’ నుంచి కొత్త పోస్టర్..
ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో వరుణ్‌కి జోడిగా సాక్షి వైద్య నటిస్తుంది.
సోమవారం సాక్షి వైద్య పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
అందులో వరుణ్, సాక్షి రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రమిది.