కొత్త ప్రతిభని ప్రోత్సహించేందుకు తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ సంస్థని ప్రారంభించారు రామ్‌చరణ్.
ఆదివారం ఈ బ్యానర్ లో రానున్న తొలి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ది ఇండియా హౌస్’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ చిత్రంలో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్ ఈ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని ప్రకటించారు నిర్మాతలు.
ఈ వీడియో ద్వారా ఈ చిత్రం స్వాతంత్య్రానికి పూర్వం లండన్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్టు తెలిస్తోంది.
‘‘రాజకీయ అలజడితోపాటు... ఓ ప్రేమకథకీ చోటున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఒక ప్రత్యేకమైన కాలానికి తీసుకువెళ్తుంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా రూపొందుతుంది. త్వరలోనే మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామ’’ని తెలిపాయి సినీవర్గాలు.