ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివరగా వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది
ప్రస్తుతం రామ్ శ్రీలీలతో జోడిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు
ఇదిలా ఉంటే రామ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే
ఈ వార్త పై స్పందించిన రామ్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో తనకైనా చెప్పండంటూ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు
అయితే తాజాగా "'సన్'డే.. సిద్దాంత్ పోతినేని" అంటూ పిల్లవాడితో ట్విటర్‌లో షేర్ చేసిన ఫోటో ట్విటర్‌లో వైరల్‌గా మారింది
ఇది చూసిన నెటిజన్లు రామ్‌కు ఇంత పెద్ద కొడుకున్నాడా? అయినా తనకెప్పుడు పెళ్లైంది? అంటూ అయోమయంలో పడ్డారు
అసలు విషయం ఏంటంటే ఆ ఫోటోలో రామ్‌తో ఉన్న పిల్లవాడు అతడి అన్నయ్య కొడుకు సిద్దాంత్ పోతినేని. సమయం దొరికితే చాలు రామ్ తనతో ఆడుతూ కనిపిస్తారు