అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా  ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఎన్‌బీకే 108 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం ఈ చిత్రం చిత్రకరణ జరుగుతుంది.

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా కాజల్‌ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం యంగ్ హీరోయిన్ శ్రీలీల బాల్లయ్య కూతురి పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా తాజాగా గురువారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించింది చిత్ర బృందం.

ఈ చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మూవీ మేకర్స్.

ఈ మేరకు ఓ మాస్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది మూవీ యూనిట్.

ఈ చిత్రం ఇప్పటివరకు చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ అలరించనున్నారు.

అంతేకాదు, అనిల్‌ రావిపూడి శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.