ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ హోస్ట్‌గా బాలకృష్ణ.

హిటైన సీజన్ 1.. అంతకుమించి అనేలా వస్తోన్న సీజన్ 2 

టీడీపీ అధినేత చంద్రబాబు‌తో ప్రారంభం కానున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2, అక్టోబర్ 14న టెలికాస్ట్

ఈ ఎపిసోడ్‌లో ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు.. 

బాలకృష్ణ: మీ జీవితంలో చేసిన రొమాంటిక్ పనేంటి.? చంద్రబాబు(నవ్వుతూ): మీరు సినిమాల్లో చేశారు. నేను స్టూడెంట్‌గా చేశా

బాలకృష్ణ: మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.? చంద్రబాబు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి

1995 నాటి బిగ్ డెసిషన్‌కు ఎమోషనల్ అయిన చంద్రబాబు.. 

'ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా.? కాళ్లు పట్టుకుని అడిగా' అని బాలకృష్ణను ఉద్దేశించి సీరియస్‌గా మాట్లాడిన చంద్రబాబు.. 

ఆ తర్వాత లోకేష్‌ ఎంట్రీతో ఎపిసోడ్‌లో మళ్లీ సందడి షూరూ.. 

మరి పూర్తి విశేషాలు తెలియాలంటే.. ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.