ప్రస్తుతం షారుక్‌ఖాన్ ‘జవాన్’ మూవీలో హీరోయిన్ గా బిజీగా ఉంది నయనతార
ఆమె మరో కొత్త మూవీలో నటించనున్నట్లు తమిళవర్గాల్లో చర్చ జరుగుతుంది
ఈ చిత్రంలో లారెన్స్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం
అమలాపాల్‌తో ‘ఆమె’ సినిమాని రూపొందించిన రత్నకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర కథ ఇప్పటికే సిద్ధమైందట
దీని గురించి రత్నకుమార్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు
నటీనటులతో చర్చలు, సినిమాకు సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి
నేను ప్రస్తుతం ‘లియో’ సినిమాతో బిజీగా ఉన్నాను. ఈ సినిమా రచయితల్లో ఒకరిగా పనిచేస్తున్నాను
ఇది పూర్తయ్యాకా నేను దర్శకత్వం వహించనున్న సినిమాపై పూర్తిస్థాయి దృష్టిపెడతానని తెలిపారు రత్నకుమార్