మాళవికా మోహనన్‌పై లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఫ్యాన్స్ ఆగ్రహం

సోషల్‌మీడియాలో మాళవికాను ఓ ఆట ఆడేసుకుంటున్నారు

మాళవిక తాజా చిత్రం 'క్రిస్టి' ప్రమోషన్స్‌లో భాగంగా మలయాళీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు

‘లేడీ సూపర్‌స్టార్‌’ అనే పిలుపు తనకు నచ్చదని అన్నారు

ఇక ఈ వ్యాఖ్యలపై నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు

నయనతారను దృష్టిలో పెట్టుకునే మాళవిక ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు భావించి ఆమెను విమర్శిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు

నయనతారను ఉద్దేశించి అనలేదని.. హీరోయిన్లందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించినట్లు చెబుతూ ఆమె తాజాగా వివరణ ఇచ్చారు