TV9 Telugu

నయనతారకు క్రేజీ ఆఫర్‌..  ఆ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ మూవీలో..

17 Febraury 2024

షారుక్‌ ఖాన్‌ సరసన నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలోనూ సత్తా చాటిందీ అందాల తార.

త్‌ సినిమా ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్, పాపులారిటీ వేరు. లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌తో భారీ పారితోషకం తీసుకుంటుందామె.

ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ నయనతారను వరించినట్లు కోలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే..

తమిళ సినిమా  పరిశ్రమలో డైరెక్టర్‌ వెట్రిమారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుంటారాయన.

ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న వెట్రిమారన్‌ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఇందులో లేడీ సూపర్‌ స్టార్‌  నయనతార హీరోయిన్‌గా నటించనున్నారట. ఇందుకు నయన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్.

ఈ సినిమాకు వెట్రిమారన్‌ శిష్యుడు విక్రమన్ అశోకన్ దర్శకత్వం వహిస్తున్నారట. కవిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ అన్నపూరణి మిక్స్‌ డ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. పైగా ఈ మూవీని వివాదాలు కూడా చుట్టుముట్టాయి.