సంచలనం అన్న పదానికి మారు పేరు నయనతార అనవచ్చు.

నాలుగు పదుల వయసును టచ్‌ చేయనున్న నయనతార ఇప్పటికీ ఫిట్‌నెస్‌లో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతోంది.

అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ రహస్యం వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

అవేంటో చూద్దాం.. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్‌ వర్కౌట్స్‌, యోగాలే.

ముఖ్యంగా నయనతార ఫిట్‌నెస్‌కు యోగా బాగా ఉపకరించింది.

ఈమె నిత్యం రెండు గంటలు యోగా చేస్తుందట. అలాగే ఈమె డైట్‌ ప్లానింగ్‌లో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉండాల్సిందేనట.

ఉదయం అల్పాహారంలో పళ్ల రసం తప్పనిసరి. పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది.

మధ్యాహ్నం భోజనంలో నాన్‌ వెజ్‌, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది.

ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ కలిగిన పదార్థాలను దూరంగా పెడతుందట.

ఇకపోతే రోజుకు 8 గంటలు నిద్ర పోవడమనే అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తుందట. మంచి నిద్రవల్ల కూడా బరువును కంట్రోల్‌లో ఉంచుతుందన్నమాట