నయన్..డిగ్రీ తర్వాత సీఏ చదవాలనుకుని అనుకోని విధంగా సినిమాల్లోకి వచ్చారట. అందుకు పెద్ద కారణమే ఉంది..
నయన్ పెదనాన్నకు ఓ యాడ్ ఏజెన్సీ ఉండటంతో, ఫొటోలు తీసి వివిధ సంస్థలకు పంపారు
అంతే.. సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు 74 మువీల్లో నటించారు
దక్షిణాది కథానాయికల్లో అధిక చిత్రాల్లో నటించిన ఘనత నయన్‌దే కావడం విశేషం
నయనతారకు మీడియా ముందుకు రావడం అస్సలు ఇష్టం ఉండదట
తాను మితభాషినని, పదేపదే మీడియా ముందుకు వస్తే, వాళ్లు అడిగేందుకు ప్రశ్నలుండకపోవచ్చని ఓ సందర్భంలో నయన్ అన్నారు
'అయ్యా' సినిమా తర్వాత బయట ఎక్కడ కనిపించినా చీరలోనే కనిపించాలని అభిమానులు కోరారట. అందుకే ఎక్కువగా చీరలో కనిపిస్తుంటారు