కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన వేళ ‘దసరా’ సినిమా తర్వాత నాని చేయనున్న కొత్త మూవీపై స్పష్టత ఇచ్చారు

కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ నాని 30వ చిత్రానికి దర్శకత్వం వహించన్నారు

ఈ చిత్రాన్ని చెరుకూరి వెంకట మోహన్‌, విజయేందర్‌రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు 

ఈ సినిమాకి హీరోయిన్ గా సీతారామంతో విజయాన్ని అందుకొన్న మృణాల్‌ ఠాకూర్‌ నటించనున్నారు 

ఈ చిత్ర వివరాలను ఆదివారం ఓ వీడియో రూపంలో విడుదల చేసింది చిత్ర యూనిట్

ఆ వీడియోలో నాని ఓ భవనంపై కూర్చొని ఫొటోలు చేస్తూ తన తర్వాత సినిమా గురించి తన ఆన్‌స్క్రీన్‌ కుమార్తెతో చర్చిస్తూ కనిపించారు

ఈ వీడియో ద్వారా ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తుంది 

ఈ చిత్రంలో నాని మీసాలు లేకుండా క్లీన్ సేవ్ లో కనిపించనున్నారు