పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి

ఐదారు తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నమిలి అప్పుడు వ‌చ్చే ర‌సాన్ని మింగాలి. వీటిలో ఉండే యాంటీ అల్సర్ గుణాలు గ్యాస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.

ఆహారం ఎక్కువగా తిన‌డం వ‌ల్ల వ‌చ్చిన అజీర్ణ స‌మ‌స్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్యలు తలెత్తవు.

వాము ఆకులను నమిలినా జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

మజ్జిగ కడుపులో ఆమ్ల తటస్థీకరణకు సహాయపడే లాక్టిక్ ఆమ్లం మజ్జిగలో ఎక్కువగా ఉంటుంది, తద్వారా అజీర్ణం తగ్గుదలలో సహాయపడుతుంది. 

ఒక కప్పు వేడి నీటిలో ఒక అంగుళo పొడవు ఉన్న దాల్చిన చెక్కను కానీ లేదా పొడిని కానీ జోడించండి. 5 నుండి 10 నిముషాలు నానబెట్టిన తర్వాత, కొంచం తేనేని జోడించి సేవించండి.

ప్రతి భోజనం తర్వాత సోంపు గింజలను ఒక టీస్పూన్ తీసుకోవడం కూడా మంచిదే.

భోజనానికి ముందు రోజుకు రెండుసార్లు కప్పులో నాల్గవభాగాన కలబంద (అలోవెరా) రసం తీసుకోండి. శరీరమును హాని చేసే పదార్ధాలను తొలగించుటలో సహాయం చేస్తుంది.

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనె ను జోడించండి. భోజనానికి గంట ముందు సేవించడం మంచిది. నీటితో కలపకుండా నేరుగా కూడా తేనెను ఒక టీ స్పూన్ తీస్కోవచ్చు.

ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా నిమ్మరసం మరియు చిటికెడు ఉప్పు మరియు బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి. అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది.