భారత రాష్ట్రపతి భవన్ అసలు యజమాని ఎవరు?

TV9 Telugu

03 February 2025

భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

భారతదశంలోని రాష్ట్రపతికి వారి పదవికాలంలో నివసించడానికి కల్పించిన రాష్ట్రపతి భవన్ అసలు యజమాని ఎవరో తెలిపింది.

రాష్ట్రపతి భవన్‌ను నిర్మించడానికి 17 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. లార్డ్ హార్డింజ్ దాని నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్‌కి పునాది అప్పటి బ్రిటిష్ వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ వేశారు.

రైసినా హిల్స్‌పై నిర్మించిన ఈ వైస్రాయ్ హౌస్‌లో నివసించిన మొదటి వ్యక్తి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్.

ఆ సమయంలో వైస్రాయ్ హౌస్ ప్రధాన భవనాన్ని హరున్-అల్-రషీద్ నిర్మించారు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి రూ. 14 లక్షల అంచనా వ్యయం అయింది.

 భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ యాజమాన్య హక్కులు భారత ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

భారత ప్రభుత్వ ఆస్తి అయినందున, దాని నియంత్రణ కేంద్ర ప్రభుత్వం క్రింద ఉంటుందని రాష్ట్రపతి భవన్ ప్రకటన తెలిపింది.