24 September 2023

నయా జోష్.. నయా లుక్.. సరికొత్తగా వందే భారత్‌ కోచ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్.

అత్యాధునిక సదుపాయాలతో అత్యంత వేగంగా పరుగులు పెట్టేలా రైళ్లను తయారు చేశారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 వందేభారత్ రైళ్లుఅందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లు ప్రారంభం.

కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో, మిగిలిన రైళ్లు నీలం రంగులో తీర్చిదిద్దారు.

కొత్త కోచ్‌ల్లో సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ పెంపు. దీంతో ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపుకునే అవకాశం.

కొత్త కోచ్‌ల్లో మెత్తటి కుషన్‌లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్ల రంగును రెడ్‌ నుంచి బ్లూకు మార్పు.

సీట్ల కింద ఏర్పాటు చేసిన మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లను సులువుగా యాక్సెస్‌ చేసేలా మార్పులు. 

కొత్తగా సీట్ల వెనుక మ్యాగజైన్‌ బ్యాగ్స్‌, టాయిలెట్‌లో మెరుగైన లైటింగ్ కోసం మరింత వెలుతురు ఇచ్చే బల్బుల ఏర్పాటు.

ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ కోసం ఎయిర్‌టైట్‌ ప్యానల్స్‌లో మార్పులు చేసిన భారత రైల్వే శాఖ.

ప్రతి కోచ్‌లోనూ అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరిచిన రైల్వే అధికారులు.