అంబానీ - రాధికా పెళ్లి పత్రిక ముచ్చట్లు..!

27 June 2024

TV9 Telugu

TV9 Telugu

‘ఊరంతా చెప్పుకొనే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి!’ అన్నట్లుగా ఊరు మాత్రమే కాదు దేశమంతా చెప్పుకునేలా.. కాదుకాదు ప్రపంచమంతా మాట్లాడుకునేంత వైభవంగా జరుగుతోంది అంబానీ ఇంట పెళ్లి

TV9 Telugu

అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌ నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఈ జంట వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాల వైరల్‌గా మారింది

TV9 Telugu

 బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో, దేవాలయ నమూనాలో ఈ వెడ్డింగ్‌ కార్డుని తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ఏమాత్రం తీసిపోకుండా తయారుచేశారు వీరి లగ్న పత్రిక

TV9 Telugu

చూపరులను అబ్బురపరిచేలా ఉన్న ఈ శుభలేఖ ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అనంత్‌-రాధికల పెళ్లి వేడుకల ముచ్చట్లు ఆకాశాన్ని దాటి స్వర్గం అంచుల వరకు వెళ్తున్నాయి

TV9 Telugu

ఇటీవలే యూరప్‌లోని లగ్జరీ షిప్‌లో నిర్వహించిన రెండో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు జరగగా.. జులైలో జరగనున్న ఈ జంట వివాహం కోసం తాజాగా ఆహ్వాన పత్రిక కూడా సిద్ధమైంది

TV9 Telugu

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. రాజసం.. ఉట్టిపడేలా దీనిని రూపొందించారు. ఎరుపు రంగులో ఓ చిన్న సైజు బాక్స్‌ మాదిరి ఉన్న ఈ శుభలేఖ తెరవగానే.. అందులో వెండితో రూపొందించిన ఓ చిన్న దేవాలయం కనిపిస్తుంది

TV9 Telugu

ఈ గుడికి నలువైపులా బంగారు తాపడంతో తయారుచేసిన గణపతి, రాధాకృష్ణులు, దుర్గామాత.. వంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. దీని లోపల లగ్న పత్రికతో పాటు దేవతామూర్తుల ప్రతిరూపాల్ని అందంగా డిజైన్‌ చేయించారు

TV9 Telugu

ఇక మరో ఇన్విటేషన్‌ను బాక్స్‌ తరహాలో రూపొందించి.. అందులో విష్ణువు, ఇతర దేవతామూర్తుల ప్రతిరూపాల్ని చెక్కినట్లుగా తయారుచేశారు. బాక్స్‌ తరహాలోనే రూపొందించిన మరో ఆహ్వాన పత్రికలో ‘A-R’ అనే అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్‌, బ్లూ కలర్‌ శాలువా, గిఫ్ట్‌లతో కూడిన వెండి బాక్స్‌ అమర్చారు

TV9 Telugu

ఇక ఈ పత్రికలన్నింటికీ బ్యాక్‌డ్రాప్‌గా భక్తి శ్లోకాల్ని జత చేయడం విశేషం. జులై 12 నుంచి మూడు రోజుల పాటు ‘శుభ్‌ వివాహ్‌’, ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, ‘మంగళ్‌ ఉత్సవ్‌’ పేరిట జరుగుతాయి