టీవీ9 సమ్మిట్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. 

TV9 Telugu

26 February  2024

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, వ్యవస్థపై భరోసా బాధ్యత ఉందని.. గ్రామాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 

గతంలో గరిబీ హఠావో నినాదాలు విన్నామని అసలు గరిబీ హఠావో అమలు జరిగింది తమ ప్రభుత్వంలోనేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోజుగు 75వేల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు.

తమ ప్రభుత్వం అంచనాలకు మించి పనిచేస్తుందన్న ప్రధాని మోదీ.. 2024లో పెట్టుబడులు రూ. 22 లక్షల కోట్లకు చేరడమే దీనికి నిదర్శమన్నారు. 

ఇక టీవీ9 గురించి మాట్లాడిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ టీవీ9 రిపోర్టింగ్‌ను ప్రశంసించారు. నేను తరచూ ప్రస్తావించే దేశ వైవిధ్యం టీవీ9లో కనిపిస్తోందని అన్నారు.

దేశంలో గడిచిన పదేళ్లలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయన్న ప్రధాని మోదీ, దేశంలో డిజిటల్‌ విప్లవం వచ్చిందని చెప్పుకొచ్చారు. 

భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. గడిచిన 10 ఏళ్లలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్న మోదీ, వేగంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

దశాబ్ధాల నుంచి దేశాన్ని ఏలిన వాళ్లకు దేశ ప్రజలపై నమ్మకం లేదన్న ప్రధాని.. భారతీయులు నిరాశవాదులని ప్రచారం చేశారని అన్నారు.

భారత్ ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని అన్నారు. అవినీతి కుంభకోణాలు అప్పట్లో సర్వసాధారణమయ్యాయని.. కానీ ఇప్పుడు అలా లేదని పేర్కొన్నారు.