08 February 2024

దేశంలోని వందే భారత్ రైళ్ల సంఖ్య ఎంతంటే..?

TV9 Telugu

దేశంలో వందే భారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి క్రేజ్ ఉంది. మరి దేశంలో ప్రస్తుతం ఇవి ఎన్ని నడుస్తున్నాయో మీకు తెలుసా ??

జనవరి 31 నాటికి దేశంలో 82 వందే భారత్ రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ మేరకు సమాధానమిచ్చారు.

వందే భారత్ రైళ్లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో వందే భారత్ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.లకు పెంచేందుకు పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 96.62 శాతంగా ఉందని రైల్వే మంత్రి వెల్లడించారు.

ఒక్కో వందే భారత్ రైలు ద్వారా ఎంతెంత ఆదాయం వచ్చింది..అలాగే రాష్ట్రాల వారీగా ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలు లేవని ఓ ఎంపీ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, రిక్లైనింగ్ ఎర్గోనామిక్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రివాల్వింగ్ సీట్ల సౌకర్యం, ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, కవచ్ వ్యవస్థ  రైళ్లలో ఉన్నట్లు తెలిపారు.

తొలి వందే భారత్ ట్రైన్‌ను 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ - వారణాసి మధ్య నడపగా ఈ సంఖ్య 82కి చేరింది. ఈ సంఖ్యను మరింత పెంచే దిశగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.