10 November 2023
అలర్ట్.. ప్రజలకు మరో యూనీక్ ఐడీ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం.!
సిమ్ కార్డు మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం.. దేశంలోని మొబైల్ యూజర్ల కోసం ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను త్వరలో ప్రారంభించనుంది.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) మాదిరి మొబైల్ యూజర్లకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనుంది.
వ్యక్తుల వద్ద ఉన్న ఫోన్లు, ఎన్ని సిమ్‌కార్డులు యజర్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి.,
ఏయే సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి అనే వివరాలను అనుసంధానిస్తారు.
ఏబీహెచ్ఏ అకౌంట్లో ప్రజల మెడికల్ రికార్డులు ఉన్నట్టే మొబైల్ యూజర్ ఐడీతో ఫోన్, సిమ్ కార్డుల వివరాలు జత చేస్తారు.
నకిలీ సిమ్‌ల బెడద, బల్క్‌లో సిమ్ కార్డుల కొనుగోళ్లు వంటి అక్రమాలకు చెక్ పెట్టి డిజిటల్ భద్రతను పెంచనుంది ప్రభుత్వం
యూజర్ల వివరాలను ఒక చోట కేంద్రీకృతం చేసే దిశగా ప్రభుత్వం ఈ ఐడీని తీసుకురానుంది.
కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఈ యూనిక్ ఐడీని కేటాయిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి