మాములుగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న బయటకు చెప్పాలన్నా భయపడతారు.
కానీ నరేశ్, పవిత్రలు మాత్రం ప్రతీది చాలా ఓపెన్‌గా చెప్పేశారు.
పెళ్లి విషయమే కాదు... పిల్లలు కనడంపై తమ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేశారు.
ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్ అంటున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నామని చెప్పారు.
‘ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు.
అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి.
అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం.
మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం.
మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్ చెప్పుకొచ్చాడు.