నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
చెరుకూరి మోహన్, తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రుతిహాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
ఇటీవలే గోవాలో ఓ సుదీర్ఘ షెడ్యూల్‌ను చేసుకుంది ఈ చిత్రం.
తాజాగా ముంబై షెడ్యూల్‌ను కూడా ఈ చిత్రం ముగించుకుంది.
తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది చిత్ర బృందం.
ఈ మేరకు ఫాన్స్ తో ఓ వీడియోను పంచుకున్నారు మూవీ మేకర్స్.
ఆ వీడియోలో తన ముఖాన్ని హుడీతో కప్పుకొని సముద్రపు ఒడ్డున నడుస్తూ కనిపించారు నాని.
కాగా ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్‌ను కూనూర్‌లో ప్రారంభించనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు.