పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 విడుదలైన దసరా చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించి
నాని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ‘దసరా’విజయంతో నాని కాన్పిడెన్స్ మరింత పెరిగింది.
వైవిధ్యమైన సినిమాలు తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని అర్థమైంది.
అందుకే ఇకపై వైవిధ్యమైన కథలనే ఎంచుకోవాలని నాని డిసైడ్ అయ్యారట.
అంతేకాదు దసరా సక్సెస్‌తో తన పారితోషికాన్ని కూడా పెంచేశారట.
వాస్తవానికి దసరా చిత్రానికి ముందే నాని తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 22 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ఇకపై కమిట్ అయ్యే చిత్రాలకు రూ. 25 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.