నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’.
మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తెలంగాణ యాసలో ఈ ఇద్దరు స్టార్స్ చేప్పే డైలాగ్స్, ఊరమాస్ యాక్టింగ్‌తో విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఫలితంగా ‘దసరా’ నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.
ఇన్నాళ్లు థియేటర్స్‌లో దుమ్ములేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయింది.
దసరా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఓటీటీ సంస్థ ‘దసరా’ విడుదల తేదిని ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్వీటర్ వేదికగా తెలియజేసింది.