నిన్నమొన్నటి వరకు లవ్, హై ఎండ్ యాక్షన్ సినిమాలతో మనల్ని ఆకట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).

ఇప్పుడు ఫిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న బింబిసార సినిమాతో తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు.

అనుకోవడమే కాదు.. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అప్పట్లో అందర్నీ పాక్‌ చేశారు.

ఆతర్వాత వెంటనే బింబిసార టీజర్‌ ను రిలీజ్‌ చేసి నందమూరి ఫ్యాన్స్ ను షేక్ చేశారు.

ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.