అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య మేనకోడలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

దసరాలోపు బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

అయితే సెట్‌లో బాలయ్య శ్రీలీల చెంప చెళ్లుమనిపించాడట.

సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగానే శ్రీలీలపై చేయి చేసుకున్నాడు.

అయితే ముందుగా శ్రీలలే తనను కొట్టమని అడగడం, బాలయ్య ఆమె చెంప చెళ్లుమనిపించడం, చివరకు ఆమె బావురుమని ఏడ్వడం జరిగిపోయింది.

చిత్రీకరణలో భాగంగానే ఈ సంఘటన జరిగినప్పటికీ చిత్రయూనిట్‌ అంతా బిత్తరపోయినట్లు తెలుస్తోంది.

ఆ సన్నివేశం చాలా సహజంగా రావడంతో అందరూ శ్రీలీలను మెచ్చుకున్నారట.

ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.