ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే ఛాట్‌ షో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అన్నిటికీ మించి ఈ టాక్‌షో కు హోస్ట్‌గా వ్యవహరించిన బాలకృష్ణ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఈ షోను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి.

ఇప్పుడీ ఫన్‌ను మరింత పెంచేందుకు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు.

కాగా బాలయ్య బాబు చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం నా సతీమణి వసుంధరే అన్‌స్టాపబుల్‌.

ఇక ఈ సీజన్‌లో వచ్చే గెస్టులపై స్పందిస్తూ ‘ ఈసారి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు. 

కచ్చితంగా మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు’ అని తెలిపారు బాలయ్య.

చివరిగా ‘మా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్య అని పిలిపించుకోను. బాలా అని పిలుస్తారు’ అని సరదాగా సమాధానం ఇచ్చారు బాలయ్య.