సమంత నాగచైతన్య ఇద్దరూ మొదటిసారి ఏమ్మాయచేశావే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఇక 2017లో వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి అంగరంఘ వైభవంగా వివాహం చేసుకున్నారు.
అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ 2021లో వీరు విడాకులు తీసుకుంటన్నట్టు ప్రకటించారు.
ఇదిలా ఉంటే విడాకుల తరవాత మొదటిసారి నాగచైతన్య సమంత ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సమంత చైతూ కలిసి నటించిన ఏమ్మాయచేశావే సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయ్యింది.ఈ నేపథ్యంలో చైతన్య తన సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ ను షేర్ చేశాడు.
ఆ పోస్ట్ లో సమంత కూడా ఉంది. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
అంతేకాకుండా సమంత కూడా సినిమా పోస్టర్ ను షేర్ చేసింది. కానీ కేవలం తాను ఉన్న ఫోటోలను మాత్రమే సామ్ షేర్ చేసింది. ఆ పోస్టర్ లలో చైతూ ఎక్కడా కనిపించలేదు.