హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో నాగశౌర్య.
ఈ ప్రామిసింగ్ హీరో ఇటీవల తన తదుపరి సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా, కమర్షియల్ గా విజయాలు అందుకునే చిత్రాలుగా ఉంటాయని ప్రకటించారు.
ఇక ఇటీవల రష్మీ, నందు జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హజరయిన నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాగ సౌర్య మాట్లాడుతూ.. జబర్దస్త్ రష్మీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..
రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేసింది..
నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది.
అంటూ రష్మీ గురించి మాట్లాడారు. అదే తరహాలో తన సినిమాల గురించి పంచుకున్నారు.
#NS24 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాని అధికారికంగా ప్రకటించారు.