తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అక్కినేని నాగ చైతన్య స్వయంగా తన పర్సనల్ సీక్రెట్స్ కొన్ని రివీల్ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతూ తన లవ్‌లైఫ్‌పై ఓపెన్‌ అయ్యారు.

సమంతతో లవ్‌మ్యారేజ్ కంటే ముందే తనకు ఓ లవ్‌స్టోరీ ఉందట.

అదికూడా ఆయన కాలేజీ రోజుల్లో. ఈ విషయాన్ని చెబుతూ నాగ చైతన్య కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 ఒకానొక సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డానని సీక్రెట్స్ బయటపెట్టాడు చైతు.

కారు వెనుక సీట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయానని తెలిపాడు.

అయితే అదేమీ తనకు తప్పుగా అనిపించలేదని, తాను చేస్తుంది ఏంటో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.

అంతా బాగానే ఉంది కానీ పోలీసులకు దొరికిపోయానని చెప్పడం గమనార్హం.