నాగ చైతన్య అనగానే అక్కినేని ఫ్యామిలి, నాగార్జున కోడుకు, వెంటేష్ అల్లుడు అతనికి ఏమి కష్టాలు ఉంటాయిలే అని అందరూ అనుకుంటారు.
కానీ నాగచైతన్య జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి.. ఎదురైన ప్రతి సంఘటన నుంచి చైతూ ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు.
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’.
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను భాగంగా నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు.. బాధపడలేదు. కానీ కొన్ని సినిమా కథల విషయంలో బాధపడ్డా.
ఆ సినిమా కథపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే అని అనుకుంటూ ఉంటాను. అలాగే ఆ సినిమాలతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను.
ముఖ్యంగా ఇది మూడు సినిమాల విషయంలో జరిగింది’’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
యితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా.. అంత ధైర్యంగా నిలబడటం చైతూకే సాధ్యం అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.