కయాన్ తెగకు చెందిన స్త్రీలు మెడ చుట్టూ కాయిల్స్ అనే ఇత్తడి రింగులు ధరిస్తారు
ఈ సంప్రదాయాన్ని 11వ శతాబ్దం నుంచి పాటిస్తున్నారు
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో ఈ సంప్రదాయం కనిపిస్తుంది
ప్రపంచంలోనే అతి పొడవైన మెడలు కలిగిన మహిళలుగా కయాన్ జాతికి ప్రత్యేక గుర్తింపు ఉంది
కయాన్ తెగలోని బాలికలకు 5 సంవత్సరాలు రాగానే మెడకు రింగును అలంకరిస్తారు
వృద్ధాప్యం వచ్చేసరికి ఒక్కో మహిళ మెడలో సుమారు 15 కేజీల బరువైన రింగులుంటాయి
కయాన్ జాతి మహిళలు మెడ రింగులు ఎందుకు ధరించడానికి 3 కారణాలు ఉన్నాయి
కయాన్ స్త్రీలను అంద విహీనంగా చేయడం వల్ల శత్రువులు వారిని విక్రయించడం, అపహరించడం చేయరు
రెండోది పులుల దాడి నుంచి రక్షించుకోవడం
మూడోది.. వీరి సంస్కృతి చిహ్నం డ్రాగన్. దాన్ని పోలి ఉండేలా రింగులను ధరిస్తారు