తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ..

అప్పట్లో దక్షిణాదికి చెందిన అగ్రహీరోల పేర్లు ఇతర రాష్ట్రాల్లో కొందరికి తెలియదు

‘బాహుబలి’ సినిమాకు ముందు ముంబయిలోని నా స్నేహితుడిని కలిసినప్పుడు అతని మాటలకు ఆశ్చర్యపోయాను

అతనితో మా సినిమా గురించి చెప్పాను. ప్రధాన పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నాడని చెప్పగానే.. ప్రభాస్‌ ఎవరు అని ప్రశ్నించాడు

నాకు ఎలా చెప్పాలో అర్థంకాక గతంలో ప్రభాస్‌ నటించిన సినిమాల పేర్లు చెబితే వాటిని చూడలేదన్నాడు

తెలుగులో చిన్ను భర్త మాత్రమే తెలుసని చెప్పాడు. చిన్ను ఎవరని అడిగితే నమ్రత శిరోద్కర్‌ భర్త మహేశ్‌ బాబు అని చెప్పాడు

నాలుగేళ్ల తర్వాత మా హీరోలందరి గురించి మీకు తప్పక తెలుస్తుందని అతని చెప్పానని రానా తెలిపాడు