పుట్టగొడుగులు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి. మొటిమల సమస్యను తగ్గిస్తాయి. మరి ఈ పుట్టగొడుగును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా

పుట్టగొడుగుల పొడి ఫేస్ ప్యాక్ అన్ని మెడికల్, కిరాణా స్టోర్స్‏లలో దొరుకుతుంది. ఇందులో విటమిన్ బి, సెలినీయం, రాగి ఉంటాయి

మష్రూమ్ పౌడర్ – 1  టేబుల్ స్పూన్, ఓట్స్ – 1/3 కప్పు, నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు, విటమిన్ ఇ క్యాప్సూల్స్ – 1

ముందుగా ఓట్స్, పుట్టగొడుగులను కలిపి పేస్ట్‏లా తయారు చేసుకోండి. తర్వాత అందులో నిమ్మరసం, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపాలి

ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయండి. ఈ పేస్ట్‌ని దాదాపు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ముఖాన్ని నీటితో కడగండి

తర్వాత ముఖానికి అలోవెరా జెల్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు

విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి

ప్రతిరోజూ పుట్టగొడుగులను తినడం వల్ల సహజంగా శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది