ఉదయ్ కిరణ్ తో పనిచేసిన తోటి నటీనటులు, దర్శకులు కూడా తమకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. 

ఉదయ్ కిరణ్ కి హైపర్ టెన్షన్ ఎక్కువ. ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది. ఆ సమయంలో ఆయన తన కంట్రోల్ లో ఉండరు.

ఇలా బాధపడుతున్న ఉదయ్ కిరణ్ ని మేము ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించాము. అక్కడ డాక్టర్ మీరు ప్రశాంతంగా ఉండాలని ఉదయ్ కిరణ్ కి ఎన్నోసార్లు చెప్పారు

డాక్టర్ తో సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యధావిధిగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారు. 

 ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సినిమాలో నటించి హిట్ కొడితే వారికి ఫోన్ చేసి అభినందించడం చిరంజీవి లక్షణం. 

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఆయనని అభినందించడమే కాకుండా తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు.

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమాలలో కూడా ప్లాప్ అయ్యారు.

చివరికి అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా ఆత్మహత్య చేసుకున్నారేమో” అంటూ మురళీమోహన్ తెలిపారు.